విడాకుల హడావిడి ముగిసింది. సమంతా కొత్త సినిమా జోరు పెరిగింది.

సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారికి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత ఏం చేయనుంది, ఆ తర్వాత తన నిర్ణయం ఏంటని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సామ్‌ బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిందని, అక్కడ వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.  దసరా పండగ రోజున సమంత ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో తాజాగా ఆమె నెక్ట్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇటీవల శాకుంతం మూవీలో నటించిన సామ్‌ తన తదుపరి చిత్రం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.  ఈ సినిమా అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో సమంత ఏదో ఆలోచిస్తూ కనిపించింది. ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్‌జీకే, ఖైదీ, ఖాకీ వంటి చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థలో తన కొత్త సినిమాను చేయనున్నట్టు సమంత ప్రకటించింది. శాంతరుబన్ అనే కొత్త డైరెక్టర్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు  డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ట్విటర్‌లో ప్రకటించింది. సినిమాకు పనిచేసేవారి వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.  ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. 

Related posts

TheIndiaMedia Website For Sale.

Best Must Watch Netflix series!

Top 5 Best Bollywood Movies to watch for non stop entertainment!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More